శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (02:40 IST)

ట్రంప్ దెబ్బకు దారికొస్తున్న పాక్: హఫీజ్ సయీద్‌ హౌస్ అరెస్ట్: జమాత్ ఉద్ దవాపై నిషేధం?

భారత్‌కు నిజంగానే ఇది తీపి కబురు. దశాబ్దాలుగా భారత్‌పై విద్వేషమే ఊపిరిగా బతుకుతూ నిలువెల్లా పగతో రగులుతూ భారత్‌పై అన్ని ఉగ్రదాడులకు నాయకత్వం వహించి రక్తం పారించిన నరరూప రాక్షసుడు హఫీజ్ సయాద్‌ను ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించింది. 2008లో జర

భారత్‌కు నిజంగానే ఇది తీపి కబురు. దశాబ్దాలుగా భారత్‌పై విద్వేషమే ఊపిరిగా బతుకుతూ నిలువెల్లా పగతో రగులుతూ భారత్‌పై అన్ని ఉగ్రదాడులకు నాయకత్వం వహించి రక్తం పారించిన నరరూప రాక్షసుడు హఫీజ్ సయాద్‌ను ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించింది. 2008లో జరిగిన ముంబై దాడుల మారణ హోమంలో 164 మంది చనిపోయారు. ఈ దాడులు సయీద్ కనుసన్నల్లోనే జరగటం తెలిసిందే. హఫీజ్ నిర్వహిస్తున్న జమాత్ ఉద్ దవాను నిషేధిత సంస్థగా ఈ అర్ధరాత్రి ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి.
 
ట్రంప్ ఎప్పుడు ఎలాంటి చర్యలకు దిగుతాడో ఊహించలేక ఇప్పటికే సతమతమౌతున్న పాక్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోనే సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక ఉగ్రవాదంపై విరుచుకుపడతానని హెచ్చరించిన 10 రోజుల్లోనే పాక్ దారిలోకి రావటం గమనార్హం. ముంబై దాడుల సూత్రధారి, లష్కర్ ఎ తొయిబా చీఫ్ హఫిజ్ సయీద్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉంచడం పాక్ చరిత్రలో సంచలనంగా భావిస్తున్నారు. గతంలో ఇదేమాదిరి నిర్బంధంలోకి తీసుకున్నట్లు నటించి వదిలేసిన పాక్ ఈ సారి ట్రంప్ దెబ్బకు జడిసి హఫీజ్ ఇంటినే సబ్ జైలుగా ప్రకటించి నిర్బంధంచింది. 
 
సయీద్ పాక్‌లో నిర్వహిస్తోన్న జమాత్ ఉద్ దవాను నిషేధిత సంస్థగా ఈ అర్ధరాత్రి ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హఫిజ్ సయీద్ తలపై ఇప్పటికే అమెరికా పది మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది.  అమెరికా గతంలో పాక్‌లోని అబోటాబాద్ కాంపౌండ్‌పై దాడిచేసి లాడెన్‌‌ను మట్టుబెట్టింది. అదే తరహా దాడులు జరగవచ్చని పాక్ కలవరపడుతోంది.
 
సయీద్ పాక్‌లో నిర్వహిస్తోన్న జమాత్ ఉద్ దవాను నిషేధిత సంస్థగా ఈ అర్ధరాత్రి ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హఫిజ్ సయీద్ తలపై ఇప్పటికే అమెరికా పది మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది.  అమెరికా గతంలో పాక్‌లోని అబోటాబాద్ కాంపౌండ్‌పై దాడిచేసి లాడెన్‌‌ను మట్టుబెట్టింది. అదే తరహా దాడులు జరగవచ్చని పాక్ కలవరపడుతోంది.
 
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే పాక్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హపీజ్‌ని నిర్బంధించిందని తెలుస్తోంది. ముస్లిం దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ అమలు చేస్తున్న వీసా పాలసీని తీవ్రంగా విమర్శిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం అమెరికాపై విమర్శలు గుప్పించింది. తనపై విమర్శలతో ఆగ్రహోదగ్రుడైన ట్రంప్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ నిర్బంధంపై ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.