శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (21:27 IST)

హార్ధిక్ పటేల్ రాసలీలలు.... నిజమా...! ...సోషల్ మీడియాలో హల్‌చల్

గుజరాత్‌లో ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్న హార్థిక్ పటేల్ రాసలీలల వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆయన తన స్నేహితులతో కలసి ఓ అమ్మాయితో సాగిస్తున్నట్లు ఉన్న ఆ వీడియో అసభ్యకరంగా కనిపిస్తోంది. ఉద్యమం ఒక ఉదుట ఎగుస్తున్న సమయంలో ఈ వీడియో బహిర్గతం కావడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. 
 
పటేల్ కులస్తుల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువ ఉద్యమకారుడు హార్థిక్ పటేల్ గురించి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన తన సన్నిహితులతో కలిసి అసభ్య భంగిమల్లో సాగించిన రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
 
ఇది బ్యాంకాక్‌లో హార్థిక్ సాగించిన రొమాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిని పటేల్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పటేల్ కులస్తులను ఓబీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న తరుణంలో ఇది ఓ కుట్రంటూ కొట్టి పారేస్తున్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నమని వాదిస్తున్నారు.