శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (11:57 IST)

పసిడి గెలిస్తే రూ.కోటి నజరానా: బీహార్ సర్కార్ బంపర్ ఆఫర్

హర్యానా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గే హర్యానా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై భారీ మొత్తాన్ని బహుమతిగా ఇవ్వనుంది. కామెన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే కోటిరూపాయలు, రజతానికి రూ. 50 లక్షలు, కాంస్యానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకుముందు ఈ మొత్తం స్వర్ణానికి 25 లక్షలు, రజతానికి రూ.10 లక్షలు, కాంస్యానికి రూ. 5 లక్షలుగా ఉండేది.
 
ఇకపై ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం గెలిస్తే రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు హర్యానా సర్కార్ ఇవ్వనుంది. గతంలో ఆసియా క్రీడల్లో స్వర్ణానికి రూ.25 లక్షలు, రజతానికి రూ.15 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షలను హర్యానా సర్కార్ బహుమతిగా ఇచ్చేది.
 
బుధవారం హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ ఈ కొత్త నజరానాను ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో హర్యానా క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 3 బంగారం, 5 రజత పతకాలు గెలుచుకున్నారని ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను మరింత ప్రోత్సాహించడానికే ఇంత భారీ నజరానాను ప్రకటించామని భూపేందర్ సింగ్ వెల్లడించారు.