Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : అమిత్ షా

శుక్రవారం, 18 మే 2018 (08:53 IST)

Widgets Magazine

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్ణాటక వ్యవహారంపై రాహుల్‌ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటికి అమిత్ షా కౌంటరిచ్చారు.
amit shah
 
'కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి బహుశా తమ పార్టీ 'ఘనమైన' చరిత్ర గురించి గుర్తులేదనుకుంటా. వారి పార్టీ చరిత్రంతా ఎమర్జెన్సీ, ఆర్టికల్‌ 356 దుర్వినియోగం, కోర్టులు, మీడియా, పౌరసమాజాన్ని వినాశనం చేయడంతో నిండి ఉంది' అని గుర్తుచేశారు. 
 
'కర్ణాటకలో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది? 104 సీట్లు గెలిచిన బీజేపీకా? లేక 78 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకా?' అని ప్రశ్నించారు. యడ్డి సర్కారుకు బలనిరూపణకు గవర్నర్‌ 15 రోజులు సమయం ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని చేయడంగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. 'తన రాజకీయ ప్రయోజనాల కోసం జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతిస్తామంటూ ఆఫర్‌ ఇచ్చిన క్షణమే ప్రజాస్వామ్యం హత్యకు గురైంది' అని ఘాటుగా స్పందించారు. 
 
కానీ, బీహార్, గోవా, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారించిన తీరుపై మాత్రం ఆయన ఏమాత్రం స్పందించలేదు. పైపెచ్చు.. బీహార్‌లో ఆర్జేడీ, మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీటిపై మాత్రం అమిత్ షా స్పందించక పోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్ని స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధం : పవన్ కళ్యాణ్

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు ...

news

మా వెనుక పవన్ కళ్యాణ్ వున్నారు... అంతే చాలంటున్నారు...

పేద ప్రజలకు అండగా నిలుస్తానన్నాడు. అన్నగా వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఆ గ్రామంలో కొండంత ...

news

సెల్ఫీతో సూసైడ్....?

హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ ...

news

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసు : పవన్

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆసక్తికర ...

Widgets Magazine