శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (07:55 IST)

ఇక అక్కడ అందరికీ ఇళ్ళే... ఎక్కడ?

భారత స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవం నాటికి దేశంలో రెండు కోట్ల మందికి సొంత ఇల్లు నిర్మించుకుని విధంగా చర్యలు తీసుకోవడానికి కేంద్రం పావులు కదుపుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాలలోని పట్టణాలను ఈ స్కీం కిందకు చేర్చుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 40 పట్టణాలను స్కీం కింద ఎంపిక చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం షరతు విధించిన ఆరు కీలక సంస్కరణలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గృహనిర్మాణం, పట్టణ దారిద్య్ర నిర్మూలన మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందంపై సంతకాలు చేయడంతో రాష్ట్రంలోని 40 నగరాలు, పట్టణాలలో పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర పట్ట ణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య అనుమతినిచ్చారని నేడిక్కడ విడుదలైన ఒక ప్రకటన తెలియజేసింది. ‘అందరికీ గృహాలు’ పేరుతో వ్యవహరి స్తున్న ఈ పథకం క్రింద గృహాల నిర్మాణానికి నగరాలు, పట్టణాలలో కొంత భూమిని ప్రత్యేకిస్తూ మాస్టర్‌ప్లాన్‌లను సవరించాలని నిర్ణయించారు. ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రు.1లక్ష నుండి రు.2.30లక్షల వరకూ సహాయాన్ని అందజేస్తుందని వెంకయ్యనాయుడు కార్యాలయం తెలియజేసింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన నగరాల జాబితా 
 
గ్రేటర్‌ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, అమరావతి రాజధాని నగరం, నెల్లూరు, కర్నూలు, కడప, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, ఆదోని, తెనాలి, పొద్దుటూరు, చిత్తూరు, హిందూపురం, భీమవరం, మదనపల్లె, గుంతకల్‌, శ్రీకాకుళం, ధర్మవరం, గుడివాడ, నర్సరావుపేట, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట, కావలి, ఎమ్మిగనూరు, రాయచోటి, కదిరి, చీరాల, పాలకొల్లు, శ్రీకాళహస్తి, మంగళగిరి, గూడూరు లు ఈ పథకం కింద ఉన్నాయి.