Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా

హైదరాబాద్, శనివారం, 8 జులై 2017 (06:15 IST)

Widgets Magazine

ఇది మరే దేశంలోనో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తూ భారత్‌లోనే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బిడ్డలు పుట్టాక మరొకామెతో సంబందం పెట్టుకుని ఇంటి ముఖం చూడకపోగా విడాకులు నోటీసు పంపి మరీ కోర్టుకీడ్చితే అంతవరకు సహనం పాటించిన ఆ అపర కాళికగా మారిపోయింి. కోర్టులోనే తన భర్తకు బట్టలూడదీసి మరీ చెప్పులతో బాదిపడేసింది. చూస్తున్న జనం, లాయర్లు, కోర్టు సిబ్బంది వారిని బయటకు పంపి అక్కడ మళ్లీ ఆ భర్తగాడికి మరో రెండు తగిలించారు. అప్పటికీ బుద్ధి రాని అతగాడు కుటుంబంతో కలిసి హత్యాయత్నం చేసిందని కేసు పెట్టాడు.
 
వివరాల్లోకి వెళితే. అహమ్మదాబాద్‌‌కి చెందిన అతగాడు ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తల్లిని చేసిన తర్వాత మొహం చాటేశాడు. మరో యువతిని ప్రేమ ముగ్గులోకి దింపి, అక్రమ సంబంధం నెరుపుతూ.. ఇంటి పట్టుకు రావడం పూర్తిగా మానేశాడు. ప్రియురాలితో మరో పెళ్లికి సిద్ధమైన ఆ ప్రబుద్ధుడు.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపించి, కోర్టుకీడ్చాడు. 
 
కోర్టు ప్రాంగణంలో ఆ అమర ప్రేమికుణ్ని చూడగానే అతడి భార్య శివాలెత్తిపోయింది. అతడి బట్టలూడదీసి చెప్పులు తెగేదాకా కొట్టింది. ఆ మహిళకు తన తల్లి, సోదరీ కూడా తోడవ్వడంతో.. ఆ వ్యక్తికి బడితె పూజ బాగా జరిగింది. జనమంతా విస్తుపోయి చూసిన ఈ సన్నివేశం అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. యువతి తన రక్త సంబంధీకులతో కలసి భర్తను విపరీతంగా కొడతుండటం చూసిన కొంత మంది లాయర్లు వాళ్లను వారించారు. 
 
కోర్టు సిబ్బంది వచ్చి, వారిని ఆ ప్రాంగణం నుంచి బయటికి పంపించారు. కోర్టు బయటికి వచ్చిన తర్వాత మనోడికి మరో రౌండు తగిలించారు. దీంతో అతడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తొలుత ఆ వ్యక్తిపై జాలి చూపించిన కొంత మంది అసలు విషయం తెలుసుకున్నాక మరో నాలుగు తగిలించండని సలహా ఇచ్చారు. 
 
ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకుంటూ విడాకులు పంపించాడని ఆమె.. కుటుంబంతో కలిసి హత్యాయత్నం చేసిందని అతడు.. ఒకరిపై మరొకరు కేసు పెట్టుకున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సుఖం కోసం వచ్చాడు.. చూసి వలచాడు... బయటకు లాగాడు.. మంచిదే కానీ...

వేశ్యవృత్తిలో ఉన్నామెను ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి ...

news

నీ సుఖమే నే కోరుకున్నా.. మాజీ భార్యకు పెళ్లి చేసిన మాజీ భర్త

పర పురుషుడితో మాట్లాడుతోందని అనుమానం వస్తేనే చాలు కట్టుకున్న భార్యను అమాంతంగా నరికి ...

news

చిత్తూరు, నెల్లూరులను అలా మార్చేస్తాం... అమరనాథ రెడ్డి(వీడియో)

తిరుపతిలోని శిల్పారామంలో మెగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ...

news

ఆమె కోసం చేయి చాచిన ట్రంప్... షాకిచ్చిన పోలెండ్ ప్రెసిడెంట్ వైఫ్(వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు మహిళలు వీలున్నప్పుడల్లా షాకులిస్తూనే వున్నారు. ...

Widgets Magazine