రోటీ మాడ్చిందని తలాక్‌ చెప్పేశాడు.. ఎక్కడ?

మంగళవారం, 10 జులై 2018 (08:59 IST)

ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానంతో ఆ మతానికి చెందిన మహిళలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నవిషయానికే కట్టుకున్న భర్తలు తమకు తలాక్ చేప్పేస్తున్నారు. దీంతో అనేక మంది ముస్లిం మహిళలు నడిరోడ్డుపై పడుతున్నారు. 
 
తాజాగా భార్య పొరపాటున రోటీ మాడ్చిందనే కారణంతో ఓ భర్త తలాక్‌ ఇచ్చాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా పహరేతా గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తరచూ వేధిస్తున్నాడని, సిగరెట్లతో శరీరంపై వాతలు పెట్టేవాడని వాపోయింది. వంట చేసే సందర్భంలో రోటీలు కొంచెం మాడాయని.. ఆగ్రహించిన భర్త తలాక్‌ చెప్పాడని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 
 
కాగా, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే విషయంపై కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శాయశక్తులా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశం ఇపుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉన్న విషయం తెల్సిందే.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తకు మాంసంకూర వడ్డించి.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందో తెలుసా?

భార్య చేతుల్లో భర్తలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భార్యల ...

news

మహిళలు చూడాలని హస్త ప్రయోగం చేశాడు... ఎక్కడ?

కామాంధుల ఆగడాలు రానురానూ మితిమీరిపోతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ...

news

జగన్, పవన్‌లు బీజేపీ పంజరంలో రామచిలుకలు... డొక్కా మాణిక్యవరప్రసాద్

అమరావతి : జగన్, పవన్, ఐవీఆర్ కృష్ణారావు, రమణదీక్షితులు... బీజేపీ పంజరంలో చిక్కుకున్న ...

news

కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు చిత్తూరులో వదిలేశారు... మరిప్పుడు ఏపీ పోలీసులు ఏం చేస్తారో?

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఈమధ్య కాలంలో మారిపోయిన కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు చక్కగా ...