రామాయణ స్టాంపును విడుదల చేసిన ఇండోనేషియా

Rama-sitha-lakshmana
మోహన్| Last Updated: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:23 IST)
ప్రపంచదేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్‌కి అతి సమీపంలో ఉన్న ఇండోనేషియా భారత్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే వస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభించి డెబ్బై ఏళ్లయిన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను గౌరవిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ చిత్రంతో కూడిన స్మారక స్టాంపును విడుదల చేసింది. 
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
మున్ముందు కూడా భారత్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తామని ఇండోనేషియా విదేశాంగ శాఖామాత్యులు వెల్లడించారు. కాగా గతేడాది ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియాను సందర్శించి పలు ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :