Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివ శివా... విద్యార్థినిపై శివాలయంలో గ్యాంగ్ రేప్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:26 IST)

Widgets Magazine
gang rape

కామంతో కళ్ళు మూసుకునిపోయిన కామాంధులకు బడి, గుడి అనే తేడాలేకుండా పోతోంది. తాజాగా ఓ కామాంధులు ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, అతను రావడంలో జాప్యం జరిగింది. దీంతో స్థానికంగా ఉండే బస్టాప్‌లో కూర్చుంది. 
 
దీన్ని గమనించిన ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి.. ఇక్కడ సేఫ్ కాదని.. సమీపంలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోమని సలహా ఇచ్చాడు. అది నమ్మిన ఆమె గుడిలోపలికి వెళ్లింది. ఆ అజ్ఞాతవ్యక్తి తన ఇద్దరు స్నేహితులకు సైగ చేయడంతో వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. 
 
ఈ ఘటన నుంచి తేరుకున్న ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రేప్ చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. సంజయ్ పటేల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతనివద్ద జరిపిన విచారణలో అసలు నిజం వెల్లడించాడు. చేసిన నేరాన్ని అంగీకరించడమే కాకుండా, మిగిలిన ఇద్దరు కామాంధుల పేర్లను కూడా వెల్లడించాడు. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి భార్యను ఐఎస్‌ ఉగ్రవాదులకు?

కేరళకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న ఓ వ్యక్తి.. ఆమెను ఐఎస్‌ ఉగ్రవాదులకు ...

news

అమరావతిలో ఘరానా మోసం.. సెంటి భూమి ఇవ్వకుండానే ఫ్లాట్లు

అమరావతిలో తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. సెంటు ...

news

'తలకు పిలక... చేతిలో చిడతలు... ఓం నమో నారా' అంటూ ఎంపీ నిరసన

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ సహజంగానే ఓ నటుడు. అలాంటి ఆయనకు ...

news

మోదీ సర్కారును చంద్రబాబు గద్దె దించాలి: ఉండవల్లి సలహా

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పది మంది ఎంపీలు ...

Widgets Magazine