శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (18:18 IST)

నేను స్వాతిని మాట్లాడుతున్నాను.. చూసి వెళ్లమ్మా అని: వాట్సాప్ సందేశం హల్ చల్

చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈమె చనిపోయాక కూడా మాట్లాడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదేంటి స్వాతి మాట్లాడుతుందా? ఆమె చనిపోతూ.. ఏమైనా విషయం చెప్పిన ఆడియో

చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈమె చనిపోయాక కూడా మాట్లాడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదేంటి స్వాతి మాట్లాడుతుందా? ఆమె చనిపోతూ.. ఏమైనా విషయం చెప్పిన ఆడియో ఫోనులో రికార్డు అయ్యిందా..? ఆ ఆడియో పోలీసులకు దొరికిందా? అందులో ఏముంది? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తకమానవు. అయితే స్వాతి మాట్లాడుతున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో ఓ సందేశం హల్ చల్ చేస్తోంది. అయితే ఇదో ఊహాజనిత సందేశం. 
 
ఈ సందేశం నెటిజన్ల మనస్సులను కలచివేస్తోంది. సందేశంతో పాటు కనువిప్పు కలిగించేలా ఉండే ఈ వాట్సప్ మెసేజ్.. "నేను స్వాతిని మాట్లాడుతున్నాను'' అంటూ తమిళంలో మొదలవుతుంది. చనిపోయినప్పటికీ నేనింకా ప్రసార మాధ్యమాల ద్వారా జీవిస్తూనే ఉంటాను. అంతకుముందు వెళ్తూ వెళ్తూ కొన్ని విషయాలు మాట్లాడి వెళ్తాను. 
 
''సమాజంలో కలలతో జీవితాన్ని ప్రారంభించే వ్యక్తుల్లో నేను ఒకదాన్నే. ఈ రోజు నేను ఎప్పటిలాగే ఉద్యోగానికి బయలుదేరాను. వీకెండ్‌ను హ్యాపీగా గడపాలనుకుంటూ.. నాన్నతో పాటు రైల్వే స్టేషన్లో దిగాను. అయితే నా హత్యను ఎందరో చూశారు. కానీ ఎవ్వరు చూశారని చెప్పేందుకు ముందుకు రారని తెలుసు. అయినా మీ మనస్సాక్షికి, విజ్ఞతకి వదిలేస్తున్నా. మీలో ఎంతమంది మహిళా సాధికారత కోసం నోరు చించుకుని వుంటారు. 
 
కానీ ఒక్కరూ కూడా నా హత్యను ఆపలేదు. అతడు (హంతకుడు) వెళ్లిన తర్వాత నాకు చికిత్స అందించడానికో లేక నా దాహార్తిని తీర్చడానికో ఒక్కరూ ముందుకు రాలేదు. రెండు గంటల పాటు నన్ను చోద్యం చూసిన దృశ్యాలు మిమ్మల్ని దహించలేదా? ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ''చూసి వెళ్లమ్మా" అని చెప్పే మీరు దానిని మగపిల్లలకు కూడా చెప్పండి. 
 
మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను మొగ్గదశలోనే తుంచేయండి.. అలా చేస్తే నాలాంటి హత్యకు గురయ్యే అమ్మాయిల సంఖ్య తగ్గుతుందనే.." సందేశంతో స్వాతి మాట్లాడినట్లు గల వాట్సాప్ మెసేజ్ అందరి మనస్సులను తాకుతోంది.