Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీహరికోటలో 104 ఉపగ్రహాలు ఒకేసారి.. చరిత్ర సృష్టిస్తామా...?!

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (16:17 IST)

Widgets Magazine
isro building

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే మామ్ ప్రయోగంతో ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన ఇస్రో మరో ప్రయోగం ద్వారా సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసుకుంది.
 
ఇప్పటివరకు మరే దేశమూ ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను తన రాకెట్ ద్వారా పంపడమే ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపడమే రికార్డు కాగా ఇస్రో ఈ రికార్డును ఫిబ్రవరి 15న బద్దలు కొట్టనుంది. మన శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. పీఎస్ఎల్వీ ద్వారా మూడు భారత ఉపగ్రహాలను 101 చిన్నస్థాయి విదేశీ ఉపగ్రహాలను ఇస్రో అంతక్షరింలోకి ప్రవేశపెట్టనుంది. వీటిలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన 88 ఉపగ్రహాలు ఉండటం విశేషం.
 
2021-22 నాటికి అంగారక గ్రహం మీదకు రోబోను పంపేలా ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అంగారకుడి పైకి చేపట్టనున్న రెండో ప్రయోగం తరువాత ఇస్రో శుక్ర గ్రహం మీదకు తన దృష్టిని మరల్చనుంది. కేవలం పది నిమిషాల వ్యవధిలో ఇస్రో 101 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. ఇవి ఒక దానితో మరొకటి ఢీ కొట్టకుండా స్కూల్ బస్సు నుంచి పిల్లలను తమ ఇళ్ళ వద్ద ఎలా దింపుతారో అంత జాగ్రత్తగా ఒక దాని తరవాత మరో ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి విడుదల చేయనుంది. గురుత్వాకర్షణ శక్తి దాదాపు శూన్యంగా ఉండే స్థితిలో ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ప్రయోగాల ద్వారా ఇస్రో మరింతగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వీలుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Isro 104 Satellites Sriharikota Mega World Record

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు అనుకూల పవనాలు.. ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయలేదట.. సుప్రీంలో పిల్.. పన్నీర్ సంగతేంటి?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు ...

news

బ్రాహ్మణి సంచలనం... నారా లోకేష్ పరిస్థితి ఏంటి?

నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి.. మాటల్లో స్పష్టత వుందనీ.. తను పెద్ద వక్తని ...

news

అమరావతి వాస్తు బాగుంది... మహిళలకు సంపూర్ణ మద్దతు: చంద్రబాబు

సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...

news

అమ్మ చనిపోయిన అర్థరాత్రే అర్థమైంది.. నా వైపు 129 ఎమ్మెల్యేలున్నారు జాగ్రత్త: శశికళ

దివంగత సీఎం జయలలిత మరణించిన నాడే ఆ రోజు అర్థరాత్రే తనకు పార్టీలో చీలిక తెచ్చేందుకు ...

Widgets Magazine