శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (11:51 IST)

ముష్కరుల కోసం భారత వేట ఎలా సాగిందంటే... తొలిసారి ఇస్రో సాయం తీసుకుని...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాయాన్ని భారత ఆర్మీ తీసుకుంది. ఈ యేడాది జూన్‌లో కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పాకిస్థాన్ అక్రమిత కాశ్మీరులో భారత సరిహద్దులకు సమీపంలోనున్న ఉగ్రవ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాయాన్ని భారత ఆర్మీ తీసుకుంది. ఈ యేడాది జూన్‌లో కార్టోశాట్ 2సీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పాకిస్థాన్ అక్రమిత కాశ్మీరులో భారత సరిహద్దులకు సమీపంలోనున్న ఉగ్రవాద శిబిరాలను ఫొటోల్లో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో సైన్యానికి అందజేసింది. వీటి ఆధారంగా భారత సైనిక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీరులోకి ప్రవేశించి సరిహద్దులకు సమీపంలో తిష్ట వేసిన ముష్కరులను 4 గంటల్లోనే వేటాడి మట్టికరిపించాయి. ఈ దాడిలో సుమారు 40 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. సైన్యానికి అత్యంత స్పష్టతతో కూడిన చిత్రాలను అందించినట్టు, ఈ చిత్రాలను కార్టోశాట్ ఉపగ్రహం తీసినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు... భార‌త్, పాకిస్థాన్ సరిహ‌ద్దుల్లో త‌లెత్తిన ఉద్రిక్త ప‌రిస్థితుల దృష్ట్యా శుక్రవారం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల సంఘం స‌మావేశం కానుంది. సైనికాధికారుల నుంచి మోడీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌పై స‌మాచారం తెలుసుకుంటున్నారు. మ‌రోవైపు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌పై రాజ్‌నాథ్ సింగ్ ప‌లువురు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌తో భేటీ కానున్నారు. అన్ని విభాగాలను స‌మ‌న్వ‌య ప‌రుచుకుంటూ, ప‌రిస్థితుల‌ను ఎదుర్కునేందుకు రాజ్‌నాథ్ సింగ్ ప‌లు సూచ‌న‌లు చేయనున్నారు.