గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 23 మే 2018 (20:59 IST)

అపూర్వ కలయిక... నరేంద్ర మోదీనే కారణమా?

దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో వినిపిస

దేశ రాజకీయాల్లో సరికొత్త ఫ్రంట్ పురుడుపోసుకుంటుందా? బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయా? ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయాలకు వేదిక అయిందా? అంటే అవుననే సమాధానం రాజకీయ నేతల్లో  వినిపిస్తుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి పలు పార్టీ నాయకులు రావడం, నేతలంతా సమావేశం కావడం చూస్తుంటే భవిష్యత్ రాజకీయాల కూటమిపై దృష్టి సారించే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఒక విధంగా మోదీనే ఈ అపూర్వ కలయికకు అవకాశం కల్పించారిని పేర్కొంటున్నారు కొందరు నేతలు. నరేంద్ర మోదీ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారనీ, రాష్ట్రాల హక్కులు హరించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పరిపాలనా విధానమే ఈ అపూర్వ కలయికకు, రాజకీయ పరిణామాలకు వేదికగా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.