Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇవాంకా గ్రీన్ గౌన్ బాగోలేదా..? రాధాకృష్ణుల స్ఫూర్తితో వారణాసి దారాలతో..

బుధవారం, 29 నవంబరు 2017 (16:23 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు హాజరైన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. 
 
అంతకుముందు యూఎస్‌ సీక్రెట్‌ ఏజెంట్స్‌ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట పరిధిలో రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గోల్కొండ కోట నుంచి హోటల్ వెళ్లిన ఇవాంకా ట్రంప్.. అక్కడ 46 నిమిషాల విశ్రాంతికి అనంతరం టీఆర్ఎస్ సర్కారు ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 9.20 గంటలకు ఇవాంకా దుబాయ్ బయల్దేరుతారు. కోటను సందర్శించిన ఇవాంకా గోల్కొండ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. 
 
ఇకపోతే.. జీఈఎస్ సదస్సు సందర్భంగా ఇవాంకా ధరించిన గ్రీన్ గౌన్ బాగోలేదని అంతర్జాతీయ మీడియా ఏకిపారేసిన నేపథ్యంలో.. ఆ డ్రెస్‌ను డిజైన్ చేసిన జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా స్పందించారు.
 
వారణాసి నుంచి తెప్పించిన నాణ్యతతో కూడిన దారాలతో దీన్ని తయారు చేశామన్నారు. అంతేగాకుండా ఇవాంక ధరించిన గ్రీన్ గౌన్‌ను బృందావన్ గార్డెన్స్‌లో కొలువైన రాధాకృష్ణుల దుస్తుల స్ఫూర్తితో తయారు చేశామని చెప్పుకొచ్చారు. ఇవాంకా కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయడం తనకు ఎంతో గౌరవం తెచ్చిందని, భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్‌ను రూపొందించామని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమే: దీపా జయకుమార్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ...

news

హఫీజ్ సయీద్ అంటే నాకెంతో ప్రేమ: ముషారఫ్ సెన్సేషనల్ కామెంట్స్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ ...

news

మెట్రో చార్జీలు ఇవే : కేసీఆర్.. శభాష్ అంటున్న భాగ్యనగరి వాసులు

భాగ్యనగర వాసులు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో ...

news

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది ...

Widgets Magazine