శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (15:15 IST)

కత్తిపట్టి ''అల్లా హో అక్బర్'' అంటే ఎలా..? ఇస్లాం అంటే శాంతి.. ఉగ్రవాదం కాదు!: ముఫ్తీ

జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఇస్లాంకు సరైన నిర్వచనం ఇచ్చారు. ఇస్లాం పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిపై ముఫ్తీ ఫైర్ అయ్యారు. కత్తి పట్టుకుని అల్లా హో అక్బర్ అ

జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఇస్లాంకు సరైన నిర్వచనం ఇచ్చారు. ఇస్లాం పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిపై ముఫ్తీ ఫైర్ అయ్యారు. కత్తి పట్టుకుని అల్లా హో అక్బర్ అనే వారికి ఇస్లాంతో సంబంధం లేదన్నారు.
 
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ముఫ్తీ మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో అమాయక ప్రజలను హతమార్చడం తగదని తెలిపారు. ఇలాంటి చర్యలను చూసి తాను ముస్లింగా సిగ్గుపడుతున్నానని.. ఇస్లాం అంటే శాంతి అని ఉగ్రవాదం, హింస కాదన్నారు. ఇస్లాం ఉగ్రవాద దాడులకు వ్యతిరేకమన్నారు. రంజాన్ సందర్భంగా ఉగ్రచర్యల్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ముఫ్తీ వ్యాఖ్యలను జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్షం తప్పుబట్టింది.