శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:16 IST)

'ఐ విష్‌ యూ హ్యాబీ బర్త్ డే'... రోశయ్యకు జయ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 82వ పుట్టిన రోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి జయలలిత శుభాకాంక్షలు తెలిపారు. ఆమె శనివారం రోజు రోశయ్యకు ఫోన్ చేసిన తన అభినందన తెలిపారు. అనంతరం ఆమె పుట్టిన రోజు లేఖను, పుష్పగుచ్చాన్ని గవర్నర్‌కు పంపించారు. 
 
ఈ సందర్భంగా ఆమె పంపిన లేఖలో 82వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రోశయ్య మంచి ఆరోగ్యం, మానసిక ఉత్సహాంతో చిరకాలం వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాష్ట్రానికి అందిస్తున్న సేవలు కొనసాగాలని కోరారు. అదేవిధంగా రోశయ్యకు పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ నేతలు, తెలుగు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.