శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:33 IST)

జయలలితకు రెస్ట్ కావాలా? 'తలైవా' రజినీకాంత్‌ను కూర్చోబెడతారా...?

తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ జగడం అలా సాగుతోంది. హఠాత్తుగా అమ్మ జయలలితకు అనారోగ్యం చుట్టుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆమెను సింగపూర్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జయలలితకు కొంతకాలం విశ్రాంతి కూడా అవసరమ

తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ జగడం అలా సాగుతోంది. హఠాత్తుగా అమ్మ జయలలితకు అనారోగ్యం చుట్టుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆమెను సింగపూర్‌కు తరలించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జయలలితకు కొంతకాలం విశ్రాంతి కూడా అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి.


దీనితో ఆమె కోలుకునేవరకూ అంటే... తాత్కాలికంగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌ను రంగంలోకి దింపుతారనే వార్తలు తమిళనాడులో వినిపిస్తున్నాయి. కావేరీ జలాల సమస్యలో రజినీకాంత్ కర్నాటకతో మాట్లాడి సమస్యను సర్దుబాటు చేయగలరనే విశ్వాసం అందరిలోనూ ఉంది. ఈ నేపధ్యంలో ఆయనతో సమస్యను సర్దుమణిగేట్లు చేయాలని తమిళనాడు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించాలన్న యోచనలో వైద్యులు ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన జయలలితను ప్ర‌స్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడక పోవడంతో ఆమెను సింగ‌పూర్ త‌ర‌లించాలని యోచిస్తున్నారు. 
 
జ‌య‌ల‌లిత‌కు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మ‌రింత మెరుగైన చికిత్సను అందించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, జ్వ‌రం త‌గ్గింద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రికి సాధార‌ణ ఆహారాన్నే ఇస్తున్న‌ట్లు పేర్కొన్నాయి. 
 
మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుప‌త్రి వ‌ద్దకు వారు చేరుకుంటున్నారు. జయలలిత త్వ‌ర‌గా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోడీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జ‌య‌ల‌లిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు లేఖ రాశారు.