Widgets Magazine

వెలవెలబోయిన పోయెస్ గార్డెన్.. అమ్మను శశికళ కలవనివ్వలేదు.. జయ చిన్ననాటి స్నేహితులు

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:13 IST)

Widgets Magazine

తమిళ రాజకీయాల్లో జయలలిత శకం ముగిసేదాకా పోయెస్ గార్డెన్‌లో కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే ప్రారంభమయ్యేది. వచ్చిపోయే నేతలు, పార్టీ సమాలోచనలు, కీలక నిర్ణయాలు.. ఇలా తమిళనాడువ్యాప్తంగా పోయెస్ గార్డెన్ అందరి నోళ్లల్లోను నానిపోయింది. అదే సమయంలో మన్నార్ గుడి మాఫియా ఎంట్రీతో కొన్ని వివాదాలకూ కేంద్రమైంది. 
 
జయలలిత మరణానంతరం అదే ఇంట్లో పాగా వేసిన శశికళ ప్రస్తుతం అక్కడినుంచే అన్నాడీఎంకె రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతుండటం శశికళను కలవరానికి గురిచేస్తోంది. అదే సమయంలో పన్నీర్ ఇంటికి పోటెత్తిన కార్యకర్తలతో ఆయన ఇల్లు కళకళలాడుతుండగా..శశికళ నివాసముంటున్న పోయెస్ గార్డెన్ మాత్రం వచ్చిపోయెవారు లేక బోసిపోతోంది. 
 
ఇదిలా ఉంటే.. శశికళకు ఎమ్మెల్యేల బలం తగ్గిపోతోంది. ఎమ్మెల్యేలే కాకుండా జయలలితకు చిన్ననాటి స్నేహితులు కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు ప్రకటించారు. జయ నుంచి తమను శశికళ దూరం చేసిందని చాందిని పంకజ్ బులానీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డెలివరీ అయినప్పుడు హాస్పిటల్‌కు వచ్చి జయ పరామర్శించారని... ఆ తర్వాత జయను కలిసే అవకాశాన్ని కూడా శశికళ ఇవ్వలేదని పంకజ్ బులానీ మండిపడ్డారు. 
 
జయను కలిసేందుకు ఒకసారి పన్నీర్ సెల్వం అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. కానీ, శశికళ మనుషులు తనను అడ్డుకున్నారని చెప్పారు. పన్నీర్ సెల్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తి అని... చివరిసారి తాము జయతో కలసి భోజనం చేసినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారన్నారు. పన్నీర్ సెల్వం వంటి వారిని తన రాజకీయ వారసుడిగా జయ ప్రకటించి ఉంటే బాగుండేదని అమ్మ స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మన్మోహన్ రెయిన్ కోట్ స్నానం.. బాత్రూమ్‌లోకి తొంగిచూడటం మోడీ అలవాటే: రాహుల్ ఎద్దేవా

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారంటూ ప్రధాని మోదీ ...

news

కోల్‌కతాలో మైనర్ బాలికల వ్యభిచారం... నిర్వాహకుల అరెస్ట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న వ్యహారాన్ని ...

news

జిందాబాద్ అనలేదు.. వర్ధిల్లాలి అన్నాడు.. విజయ్ కాంత్ చెంప చెళ్లుమనిపించాడు..

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత ...

news

చిన్నమ్మకు నో చాన్స్?.. సుప్రీంతీర్పు కోసం గవర్నర్ వేచి చూపులు?

తమిళ రాజకీయం సినిమా ఉత్కంఠను తలపిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఏ ...