సంచలనాత్మకమైన ఎక్సేంజ్ ఆఫర్ వివరాలను నిర్ణీత సమయం కంటే ముందే వినియోగదారులకు అందించనుంది. తద్వారా వారు తమ సమయానుకూలంగా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుంది. మాన్‌సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్ వివరాలు.
1. మాన్‌సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.501 చెల్లించడం ద్వారా జియో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
2. రూ.501ని తిరిగి చెల్లించే సెక్యురిటీ డిపాజిట్‌గా పేర్కొనడం వల్ల మూడేళ్ల తర్వాత వినియోగదారులు ఈ మొత్తాన్ని తిరిగి తీసుకోవచ్చు. అంటే... జియో ఫోన్ మీకు ఉచితంగా వస్తున్నట్లే.
3. ఏదైనా 2జీ, 3జీ, 4జీ ఫోన్ (VOLTE కానిది) అందించి రూ. 501 చెల్లించడం ద్వారా ఏ రిటైల్ కేంద్రంలో అయినా వెంటనే జియో ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.
4. వినియోగదారులు గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఎక్సేంజ్ చేస్తున్న ఫోన్ పనిచేసే స్థితిలో ఉండాలి మరియు చార్జర్ కలిగి ఉండాలి.
5. కొత్త జియో ఫోన్ కొనుగోలు చేస్తున్న సందర్భంగా పాత ఫోన్‌ను రిటైలర్‌కు ఇచ్చేయాల్సి ఉంటుంది.
జియో సిమ్
1. వినియోగదారులు జియో ఫోన్‌తో జియో సిమ్ పొందవచ్చు.
2. ఒకవేళ ప్రస్తుతం తాము వాడుతున్న మొబైల్ నంబరును కోల్పోవడం వినియోగదారులకు ఇష్టం లేకపోతే... మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ద్వారా అదే నంబరు పొందవచ్చు. జియోకు ఎంఎన్‌పీ ఒక్కసారి పూర్తయితే ఆ వినియోగదారుడు మాన్‌సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్‌ను ఎంచుకోవచ్చు.
స్పెషల్ రీచార్జ్ ప్లాన్
1. వినియోగదారులకు లబ్ధి చేకూర్చడం అనే తన ప్రధానమైన ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్‌సూన్ హంగామా కింద జియో ప్రత్యేకమైన జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది.
2. ఈ పథకంలో భాగంగా వినియోగదారులు యాక్టివేషన్ సమయంలో రూ. 594 చెల్లించడం ద్వారా 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు డాటాను పొందవచ్చు.
3. జియో ఫోన్ వినియోగదారులు మాన్‌సూన్ హంగామా ఎక్సేంజ్ ఆఫర్‌తో పాటుగా రూ.101 ఓచర్‌తో 6 జీబీ డాటా స్పెషల్ ఎక్సేంజ్ బోనస్‌ను సొంతం చేసుకోవచ్చు.
4. తద్వారా 6 నెలల్లో మొత్తం డాటా 90 జీబీలకు చేరుతుంది.
5. మాన్‌సూన్ హంగామా ద్వారా జియో ఫోన్‌ను రూ.501లో పొందడం మరియు రూ.594 రీచార్జీ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ మరియు డాటాను వినియోగదారులు పొందవచ్చు.
6. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ``ప్రస్తుతం రూ.49 మరియు రూ.153తో రెండు జియో ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలకు 1జీబీ డాటా అందించే రూ.49 ప్లాన్ ఒకరకంగా ట్రయల్ ప్లాన్ వంటిది. రూ.153 ఆఫర్ ద్వారా రోజుకు 1.5 జీబీ డాటా వస్తున్న నేపథ్యంలో దీనికి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. కాగా, తక్కువ డాటా కోరుతూ అదే సమయంలో తక్కువ ధరలో ఉండే రీచార్జీ ప్లాన్ కావాలని పలువురు ఆకాంక్షిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో మేం రూ.99 ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నాం. దీని ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 0.5 జీబీ డాటాను మరియు 300 ఎస్ఎంఎస్‌లను 28 రోజుల పాటు పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారుడి నెలవారి ఖర్చు దాదాపుగా 50%కి పైగా తగ్గుతుంది.
మీ పాత ఫోన్ ఎక్సేంజ్‌కు అర్హత కలిగి ఉందా?
ఎక్సేంజ్ పద్ధతిలో అందించి జియో ఫోన్ పొందేందుకు మీ పాత ఫోన్ ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలిః
1. మొబైల్ ఫోన్ ప్రస్తుతం పనిచేస్తున్న స్థితిలో ఉండాలి. ( ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తున్న స్థితిలో ఉండి డ్యామేజ్ అవడం కానీ లేదా ఏవైనా ఉపకరణాలు దెబ్బతిని ఉండటం కానీ కాలిపోవడం కాని జరిగి ఉండకూడదు).
2. గత మూడున్నరేళ్ల కాలంలో అమ్మబడినవి (అంటే 2015 జనవరి 1వ తేదీ తర్వాత ) #మాత్రమే ఎక్సేంజ్‌కు అర్హత కలిగినవి.
3. 2జీ, 3జీ, 4జీ ఫోన్లలో ఏదైనా VOLTE కానివి ఎక్సేంజ్‌కు అర్హత కలిగినవి.
4. జియో ఫోన్ లేదా సీడీఎంఏ లేదా ఆపరేటర్ లాక్ వేసిన ఫోన్లు ఎక్సేంజ్‌లో తీసుకోబడవు
5. బ్యాటరీ మరియు చార్జర్ కాకుండా హెడ్‌ఫోన్స్ వంటి ఇతర ఉపకరణాలు ఏవి ఎక్సేంజ్‌కు అవసరం లేదు.
మీ పాత ఫీచర్ ఫోన్ ఎక్సేంజ్ చేసేందుకు వెళుతున్నపుడు మీ వెంట ఏం తీసుకువెళ్లాలంటే...
1. ప్రస్తుతం పనిచేస్తున్న స్థితిలో ఉన్న మీ మొబైల్ ఫోన్.
2. పాత ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ మరియు చార్జర్
3. ఆధార్ నంబరు
4. మొబైల్ నంబరు పోర్టబిలిటీ వాడుకుంటే మీ కొత్త జియో ఎంఎన్‌పీ నంబరును తీసుకువెళ్లాలి.
విస్తృత శ్రేణి యాప్ ఎకోసిస్టమ్
1. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ 2018 నుంచి అందుబాటులోకి రానున్న జియో ఫోన్‌లో ప్రపంచంలోనే అత్యంత పాపులర్ యాప్‌లుగా పేరొందిన ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్‌లను కలిగి ఉండటంతో జియోఫోన్ భారతదేశం ఏ విధంగా విద్య, వినోదం, సమాచారం మరియు ఇతర ముఖ్యమైన సేవలను పొందుతుందో పునర్ నిర్వచించనుంది.
2. జియో ఫోన్ వినియోగదారులు ఇప్పటికే ఉచిత వాయిస్ కాల్స్ మరియు పలు రకాల అప్లికేషన్లను ప్రీమియం కంటెంట్ రూపంలో జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్, జియో చాట్ సహా ఇతర రూపాల్లో పొందుతున్నారు.
3. వినియోగదారులు విశిష్టమైన ప్రత్యేకమైన వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు, సందేశాలు పంపించుకునేందుకు మరియు ఇంటర్నెట్లో శోధించేందుకు, మ్యూజిక్ వినేందుకు, వీడియోలు చూసేందుకు మరియు జియో ఫోన్‌లో లభించే మొత్తం అప్లికేషన్నింటినీ ఉపయోగించుకోవచ్చు.