వెంకీ మామ‌లో మ‌రో హీరోయిన్ ఎవ‌రు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై ల

srinivas| Last Modified శుక్రవారం, 13 జులై 2018 (21:55 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చైతు స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. అయితే.. వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. 
 
అయితే.. వెంకీ స‌ర‌స‌న కాలా హీరోయిన్ హ్యుమా ఖురేషి న‌టించ‌నుంది టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయ‌డంతో వ‌ద్ద‌నుకున్నార‌ని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వెంకీకి హీరోయిన్ ఉండ‌దేమో అని మ‌రో ప్ర‌చారం. ఇలా వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ... చిత్ర‌ యూనిట్ మాత్రం వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ గురించి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. మ‌రి.. వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.దీనిపై మరింత చదవండి :