శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (15:39 IST)

''చాయ్ పే చర్చ'' అవసరం లేదు-''ఆవు''పై చర్చ కావాలి: సింధియా

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో యువజన కాంగ్రెస్ మత అసహనంపై ఆందోళన బాట పట్టింది. ఓ వైపు లోక్ సభలో అసహనంపై చర్చ జరుగుతుండగానే, ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఆందోళన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముందు ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ వల్లే దేశంలో అసహనం పెరిగిందని విమర్శించారు. 'చాయ్ పే చర్చ' అవసరం లేదని, 'ఆవు'పై చర్చ కావాలని పేర్కొన్నారు. దేశంలో జరుపుకునే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాలీలో అలీ, రంజాన్‌లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.