Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆడు మగాడ్రా బుజ్జీ...కమల్, రజినీలపై గుర్రుగా ఉన్న అభిమానులు..

బుధవారం, 1 నవంబరు 2017 (13:45 IST)

Widgets Magazine
Upendra

జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు వెనక్కి తగ్గి రాజకీయాల్లోకి వెళ్ళడం పూర్తిగా మానేసినట్టున్నారు. రజినీ విషయం పక్కనబెడితే మరో నటుడు కమల్ హాసన్ కూడా అదే ఊపును మొదట్లో ప్రదర్శించాడు.
 
తమిళనాడులో నెలకొన్న సమస్యలపై తాను రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తేనే మంచిదన్న నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అందరూ కమల్ హాసన్ ఒకటిరెండు రోజుల్లో పార్టీ పెట్టేస్తారని అనుకున్నారు. కానీ కమల్ కూడా రజినీ బాటలోనే నడిచాడు. ఊరించి ఉసూరుమనిపించాడు. అయితే కన్నడ నటుడు ఉపేంద్ర మాత్రం తాను అనుకున్న విధంగానే పార్టీ పెట్టేశాడు. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగానే పార్టీ గుర్తును గీసి ఏకంగా రాజకీయ పార్టీకే పురుడు పోశాడు. ఇప్పుడంతా కన్నడ, పక్కనే ఉన్న తమిళ రాజకీయాలంతా ఉపేంద్ర చుట్టూ తిరుగుతోంది.
 
ఉపేంద్ర పార్టీ పెట్టిన తరువాత అటు కమల్ ఇటు రజినీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీ పెడతామని ఇప్పటివరకు పెట్టని తమ అభిమాన హీరోలపై గుర్రుగా ఉన్నారు. ఉపేంద్రను ఆదర్శంగా తీసుకోనైనా కమల్, రజినీలు  పార్టీ పెట్టాలని కోరుతున్నారు. అయితే అభిమానుల మొరను ఈ హీరోలు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాది ఉడుం పట్టుతో సమానం.. రాహుల్ మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు

నిత్యం రాజకీయాలే అనే వారికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఆట విడుపు చర్యలతో ఔరా ...

news

డస్ట్‌బిన్‌కు పూజలు చేసిన బీహార్ ప్రజలు.. (వీడియో)

ప్రపంచంలో అత్యంత భక్తిగల దేశం మనదే. భక్తిలో ప్రజలు మూఢులుగా మారిపోతున్నారు. పంచభూతాలను.. ...

news

పట్టాలు లేకుండా నడిచే స్మార్ట్ ట్రైన్... (వీడియో)

ప్రపంచ తొలి స్మార్ట్ ట్రైన్‌ను చైనా ఆవిష్కరించింది. ఈ ట్రైన్‌ ట్రయల్ రన్‌ను కూడా ...

news

తెలంగాణ టీడీపీకి మరో షాక్.. పాలమూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మహబూబ్ నగర్ టీడీపీ ...

Widgets Magazine