Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.2 కోట్ల లంచంతో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు.. లీక్ చేసిన జైళ్ళ డీఐజీపై బదిలీ వేటు

సోమవారం, 17 జులై 2017 (14:22 IST)

Widgets Magazine
drupa

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షపడి బెంగుళూరు సెంట్రల్ శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలు అధికారులు  రూ.2 కోట్ల మేరకు లంచం పుచ్చుకుని వీవీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారట. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన కర్ణాటక జైళ్ళశాఖ డీఐజీ డి.రూపపై బదిలీవేటు పడింది. 
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో మరికొందరిని సుప్రీంకోర్టు దోషులుగా తేల్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో శశికళతో పాటు.. ఆమె వదిన, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్‌లు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. 
 
అయితే, ఈ జైల్లోని కొందరు ఖైదీలకు ఆడింది ఆట పాడింది పాట అన్న పరిస్థితులున్నాయి. సెల్‌ఫోన్లు సహా వారు ఏదీ కావాలనుకొంటే అది అందుతోందట. ఇదంతా జైలు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు వీఐపీ సౌకర్యాలు లభిస్తున్నాయని రాష్ట్ర జైళ్లశాఖ డీజీ రూప చేసిన సంచలన ఆరోపణలతో అందరి దృష్టి ఇప్పుడు ఈ జైలుపై పడింది. 
 
స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీం తెల్గీకి పరప్పణ జైలులో ప్రత్యేక సౌకర్యాలున్నాయి. అతనికి ఒళ్లు మర్దన చేయడానికి నలుగురు విచారణ ఖైదీలను అధికారులు నియమించారు. వైద్య పరీక్షల్లో 25 మంది ఖైదీలు డ్రగ్స్ వాడుతున్న సంగతి రుజవైందని డీఐజీ రూప వెల్లడించారు.
 
ముఖ్యంగా.. శశికళకు వీఐపీ సౌకర్యాలు కల్పించేందుకు రూ.2 కోట్ల మేరకు లంచం పుచ్చుకున్నట్టు డీఐజీ డి.రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెను ట్రాఫిక్ విభాగానికి బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రూ.2 కోట్ల లంచం తీసుకుని శ‌శిక‌ళ‌కు వీవీఐపీ సౌక‌ర్యాలు క‌లిపిస్తున్నార‌ని ఆఫీస‌ర్ రూప మీడియాకు వెల్ల‌డించిన నేప‌థ్యంలో పోలీసు నియ‌మాల‌ను అతిక్ర‌మించావంటూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆమెకు నోటీసులు జారీ చేసి, ఈ చర్య తీసుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లికాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్లుంది?: ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య విముఖత

తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ...

news

డ్రగ్స్ కేసు... టాలీవుడ్ అగ్రహీరోల్లో మరో హీరో వున్నారట... పేరు చెబ్తే భారీ కుదుపేనట...

డ్రగ్స్ వ్యవహారంలో సినీప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 8 మంది ...

news

మోదీజీ ఆ పదవి నాకొద్దు... వెంకయ్య నాయుడు?

ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ...

news

ఇంజనీరింగ్ పట్టభద్రుడే హైదరాబాద్ డ్రగ్ డాన్... ఇదీ కెల్విన్ 'మత్తు' చరిత్ర

డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో అబ్బురపరిచే విషయాలు వెల్లడైనట్లు ...

Widgets Magazine