మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (18:43 IST)

ముగ్గురూ అమ్మాయిలే.. వారసుడు కావాలని భార్యనే చంపేశాడు..

తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ ర

తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

విజయ్‌కు మంజుల అనే మహిళతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. విజయ్ తనకు కుమారుడు కావాలని నిత్యం వేధించేవాడు.
 
తనకు వారసుడిగా కావాలన్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ భార్యపై దాడికి దారితీసింది. విజయ్ తీవ్ర ఆగ్రహానికి గురై భార్య మంజులను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన మంజుల పెద్దగా అరవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.