శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (15:19 IST)

మోడీకి కేసీఆర్ దగ్గరవుతున్నారా? టీఆర్ఎస్ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందా? చంద్రబాబు ఇకనైనా మేల్కొంటారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరవుతున్నారా? కేంద్ర కేబినెట్‌లో తెరాస చేరుతుందా? తద్వారా ఏపీకి మళ్లీ కేసీఆర్ చెక్ పెట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మోడీ కూడా క

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరవుతున్నారా? కేంద్ర కేబినెట్‌లో తెరాస చేరుతుందా? తద్వారా ఏపీకి మళ్లీ కేసీఆర్ చెక్ పెట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మోడీ కూడా కేసీఆర్‌కు సానుకూలంగా స్పందిస్తున్నారా? ఏపీని పక్కనబెట్టేసి.. ఏపీ సీఎం చంద్రబాబుకు హామీలు నెరవేరుస్తున్నామని హ్యాండిచ్చి కేసీఆర్‌ను వెనకేసుకున్నారా? అనే సమాధానాలకు అవుననే సమాధానం వస్తోంది. 
 
ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో సన్నిహితంగా మసలడం.. ఆయన భుజంపై చెయ్యేసి పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాలను ఢిల్లీ వెళ్ళి చెప్పొచ్చిన కేసీఆర్‌ను హైదరాబాదుకు వచ్చీ రాగానే మోడీ బాగోగులు అడిగారని, నోట్ల కష్టాలు తీరాయా..? ప్రజలు ఎలా ఫీలవుతున్నారు. మీకు కావాల్సిందంతా చేస్తున్నానా? ఎలాంటి కష్టాలు లేవు కదా అంటూ కేసీఆర్‌ను మోడీ అడిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక బహిరంగంగా ఈ చర్యకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు బయటిపార్టీలు ఏవీ ఎన్డీయే ప్రభుత్వానికి ఇంత పబ్లిగ్గా సపోర్ట్ ప్రకటించిన దాఖలాల్లేవు. తెరాస మాత్రం చొరవ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. 
 
ఇందులో భాగంగా నరేంద్ర మోడీ ఈ మధ్య హైదరాబాదు వచ్చినప్పుడు ఎయిర్ పోర్టు లో కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకడం, ఆ తరువాత వీడ్కోలు ఇవ్వడం.. ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకోవడం చూస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితం కావాలని, సమయం వచ్చినప్పుడు అన్నీ అనుకూలిస్తే ఎన్డీయే సర్కార్‌లో భాగస్వామి కావాలని తెరాస ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అదే గనుక నిజమైతే.. చంద్రబాబుకు మళ్లీ తిప్పలు తప్పవు. ఏపీ అభివృద్ధికి కేసీఆర్ అడ్డం పడే అవకాశం ఉందని.. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీతో సరిపెట్టుకున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అమరావతి నిర్మాణం వంటి ఇతరత్రా అంశాలపై పట్టించుకుంటుందో లేదోననే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సో.. ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు మేల్కొంటే బెటరని వారు సూచిస్తున్నారు.