శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (11:23 IST)

కొత్త జంట సినిమాకు వెళ్లింది.. థియేటర్లో తాళి, మెట్టెలు తీసేసి..?

కొత్తగా పెళ్లైంది. నవ దంపతులు జంటగా సినిమాకు వెళ్లారు. అయితే సినిమా థియేటర్లో కూర్చున్నాకే వరుడికి గట్టి షాక్ తెలిసింది. కొత్త పెళ్లి కూతురు థియేటర్లో తాళి, మెట్టెలతో పాటు నగలన్నీ తీసి పక్కనబెట్టేసి పారిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన అంజెట్టికి సమీపంలో సేసురాజపురంకు చెందిన లూర్థ్ స్వామి.. సెల్వి సహాయాన్ని ఇటీవల పెళ్లాడాడు. 
 
ఏప్రిల్ 27వ తేదీన వీరికి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి జంటగా సినిమాకు వెళ్లారు. థియేటర్లో సినిమా చూస్తుండగా.. కూల్ డ్రింక్స్, స్నాక్స్ కావాలని కొనుక్కుని రావాల్సిందిగా లూర్థ్ సామి వద్ద సెల్వి సహాయం అడిగింది. ఇక భార్య అడిగిందని కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చేందుకు వెళ్లిన లూర్థ్ సామికి తిరిగొచ్చి చూడగా గట్టి షాక్ తప్పలేదు. 
 
తాళితో పాటు మెట్టెలు, బంగారు నగల్ని తీసి సీటు వద్ద వుంచేసిన సెల్వి సహాయం అక్కడి నుంచి పారిపోయింది. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ ఘటనపై లూర్థ్ సామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.