Widgets Magazine

మా వాళ్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు : అద్వానీ

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:52 IST)

L K Advani

మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గత ఐదు రోజులుగా పార్లమెంట్ వేదికగా చేసుకుని చేస్తున్న ఆందోళనలపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరా తీశారు. ఇదే అంశంపై టీడీపీ ఎంపీలతో 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన హామీలు, సభలో ఎందుకు నిరసన తెలుపుతున్నామో, ఇతర పరిణామాల గురించి తెదేపా నేతలు అద్వానీకి వివరించారు. పైగా, ఆందోళనలు, నిరసలను సభా నియమాలకు అనుగుణంగా చేసుకోవాలంటూ హితవు పలికారు. 
 
అనంతరం అద్వానీ వారితో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. ఒకరినొకరు గౌరవించుకోవాలని, సభా మర్యాదలు కాపాడుకోవాలని సూచించారు. ఏపీ వ్యవహారంపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోనూ మాట్లాడానని ఎంపీలతో చెప్పారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదంటూ ఆయన ఎంపీల వద్ద నిరాశ వ్యక్తపరిచినట్లు సమాచారం. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఎల్.కె.అద్వానీ తెలుగుదేశం బీజేపీ అరుణ్ జైట్లీ Dissatisfied Bjp Leaders L K Advani

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆధార్‌ను పుట్టించింది మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ...

news

అన్నంతపని చేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి!

తెలంగాణ ఆడబిడ్డ, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి అన్నంతపని చేశారు. కేంద్ర మంత్రి ...

news

బాబు పెద్ద తప్పేమీ చేయలేదు.. జైలుకెళ్తే ఓట్లు రాలుతాయ్: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ...

news

అంతా మాయిష్టం.. ఇదే మోడీ తీరు : ఏపీకే కేంద్రం కొర్రీలు

"అంతా నాయిష్ట ప్రకారమే జరగాలి. నేను చెప్పినట్టే చేయాలి. మనకు కలిసిరాని రాష్ట్రాల గురించి ...

Widgets Magazine