శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (19:11 IST)

మద్రాస్ హైకోర్టులో గొడ్డుమాంసం వంటకాలను పంచిపెట్టిన...

మద్రాస్ హైకోర్టులో వినూత్న చర్యకు దిగారు. మద్రాస్ హైకోర్టులో శుక్రవారం మధ్యాహ్నం కొందరు లాయర్లు గొడ్డు మాంసంతో తయారైన వంటకాలను పంచారు. ఆవు మాంసం విక్రయంపైనా, కలిగివుండడంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ వారు ఈ వినూత్న చర్యకు దిగారు. న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో గుమిగూడి పేపర్ కప్పుల్లో గొడ్డు మాంసం వంటకాలను అందించారు. దీంతో, అందరూ ఆశ్చర్యపోయారు. 
 
అనంతరం, లాయర్లు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. మహారాష్ట్ర సర్కారు ఇటీవలే యానిమల్ ప్రిజర్వేషన్ బిల్లు కింద గొడ్డు మాంసం విక్రయాలను నిషేధించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. దీంతో మద్రాసు హైకోర్టు లాయర్లు వినూత్నంగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.