Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరట్‌లో లైవ్ మర్డర్ (వీడియో)

గురువారం, 25 జనవరి 2018 (16:24 IST)

Widgets Magazine
live murder

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి రాలేదని చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలోని మీరట్‌లో కొందరు దుండగులు ఓ వృద్ధురాలిని, ఆమె కుమారుడిని నిలువునా కాల్చి చంపారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ హత్యా దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ ప్రాంతానికి చెందిన నిచేత్తర్‌ కౌర్‌ అనే 60 ఏళ్ల వృద్ధురాలు మరో మహిళలతో కలిసి మంచంపై కూర్చుని మాట్లాడుతోంది. ఇంతలో ముగ్గురు దుండగులు తుపాకులు చేతధరించి వచ్చి నిచేత్తర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయినప్పటికీ ఆమె ప్రతిఘటించినప్పటికీ.. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ప్రాణాలు విడిచింది. 
 
దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దుండగులు అంతటితో ఆగకుండా ఆమె కుమారుడిని కూడా హత్య చేసి మృతదేహాన్ని ఊరి చివరిలోని ఓ కారులో దాచారు. మృతురాలి పక్కనే ఉన్న మహిళను మాత్రం పారిపోయింది. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిచేత్తర్ కౌర్ భర్త కూడా ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి గురువారం నిచేత్తర్‌, కుమారుడు బల్వీందర్‌ న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. కోర్టుకు హాజరవడానికి ఒక్కరోజు ముందు ఇద్దరూ హత్యకు గురికావడంతో ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Meerut Gun Uttar Prdesh Live Murder

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర ...

news

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే ...

news

ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)

చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో ...

news

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని ...

Widgets Magazine