శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (12:46 IST)

Railway budget 2015-16: ఐదు నిమిషాల్లో టిక్కెట్లు జారీ..!

రైల్వే బడ్జెట్ 2015-16ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. భారతీయ రైల్వేలకు సంబంధించి ప్రస్తుత బడ్జెట్ లో వేగం, క్షేమం, ఆదునీకీకరణలే తమ ప్రాధాన్యాలని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ ప్రధాన్యాలను ముందుగా ప్రస్తావించిన మంత్రి, తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
 
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:
-5 నిమిషాల్లోనే ప్రయాణికులకు టికెట్ల జారీ
-ప్యాసింజర్ ఛార్జీలు యధాతధం
- కొత్తగా 1.38 లక్షల కిలో మీటర్ల మేర రైల్వే లైన్ల ఏర్పాటు
-ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు
- ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం
-రైళ్లలో బయో టాయిలెట్స్ ఏర్పాటు
-ఆరు నెలల్లో 17 వేల బయో టాయిలెట్స్ ఏర్పాటు లక్ష్యం
-650 రైల్వే స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం
-రాజధాని ఎక్స్ ప్రెస్ ల వేగం పెంపునకు చర్యలు
-మహిళల భద్రతకు టోల్ ఫ్రీ నెంబరు 182
- ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి
-రానున్న ఐదేళ్లలో 8. 5 లక్షల కోట్ల పెట్టబుడులు