శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (16:05 IST)

జయలలిత ఆరోగ్యం అత్యంత విషమం.. ఏం జరుగుతుందో చెప్పలేం : లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని ఆమెకు వైద్యం అందించే వైద్యుల్లో ఒకరైన లండన్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించార

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమని ఆమెకు వైద్యం అందించే వైద్యుల్లో ఒకరైన లండన్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
 
ప్రస్తుతం జయలలిత అత్యంత విషమ పరిస్థితుల మధ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనను లండన్ నుంచి ప్రత్యేకంగా రప్పించారు. ఆయన సోమవారం చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం జ‌య‌ల‌లిత ఆరోగ్య‌ ప‌రిస్థితిని ప‌రిశీలించి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. 
 
జ‌య‌లలిత ఆరోగ్యం చాలా విష‌మంగా ఉంద‌న్నారు. జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ప్రస్తుతం మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని చెప్పారు. అపోలో వైద్యుల‌తో పాటు ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నార‌ని ప్ర‌క‌ట‌న చేశారు.