1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:20 IST)

82 ఏళ్లలో తండ్రి అయిన పీఠాధిపతి.. 8మంది ఆడపిల్లలకు తర్వాత మగబిడ్డ..

గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు

గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు జన్మించడంతో.. ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయినా ఆమెకు కూడా మగ సంతానం కలగలేదు. 
 
రెండో భార్య కూడా ఏకంగా ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆయ‌న‌ మొత్తం ఎనిమిది మంది ఆడ‌పిల్ల‌లకు తండ్ర‌య్యాడు. ఈ క్రమంలో రెండో భార్య గురువారం ముంబైలోని ఆస్పత్రిలో ఓ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. త‌న‌కు మగబిడ్డ పుట్టాడని తెలిసిన వెంటనే పీఠాధిపతి సంతోషానికి హద్దుల్లేవు. శరణబసప్పకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 
 
శరణబసప్ప మఠం అనేక విద్యాసంస్థ‌ల‌ను కూడా నడిపిస్తోంది. ఆ మఠానికి సంరక్షకుడిగా ఉండేందుకు ఆయనకు వారసుడిగా ఈ వ‌య‌సులో మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అయితే లేటు వయస్సులో తండ్రి కావడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.