శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:41 IST)

మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!

మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అటవీ రక్షణదళ పరీక్షల అవకతవకల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌టీఎఫ్ మంగళవారం ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. 
 
ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోవాలని కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనను ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి వైదొలగారు. అటవీ రక్షణదళాల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.