శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2014 (15:51 IST)

మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ : చెరో 2 - 1/2 యేళ్లు పాలిద్ధాం : శివసేన

మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానుంది. దీంతో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో 25 ఏళ్ల అనుబంధానికి తెరదింపి... ఎవరికి వారే పోటీ చేసిన బీజేపీ, శివసేనలు మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉంది. ఎంతైనా మనంమనం ఒకటే అని ఇరు పార్టీల నేతలు అంటున్నారు. 
 
దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ రెండు పార్టీల మధ్య చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, చెరో రెండున్నర ఏళ్లపాటు సీఎం పదవిని చేపడదామని బీజేపీకి శివసేన అంతర్గతంగా ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌పై సాయంత్రం జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు. శివసేన తమ మిత్రపక్షమని... కాంగ్రెస్, ఎన్సీపీలే తమ ప్రత్యర్థులని ఇప్పటికే మహారాష్ట్ర బీజేపీ ప్రకటించింది.