శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (09:13 IST)

శారదా చిట్ ఫండ్ స్కామ్ సూత్రధారి మమతా బెనర్జే : కునాల్ ఘోష్!

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జేనని ఈ స్కామ్‌లో అరెస్టు అయి కోల్‌కతా జైలులో ఉన్న ఆ పార్టీ బహిష్కృత మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రూ.వందల కోట్ల శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాంలో మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్ధిదారు అని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసు స్కాంలో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే అరెస్టయిన కునాల్ జైల్లో రిమాండ్‌లో ఉంటున్నారు. 
 
మరోవైపు చిట్ ఫండ్ స్కాంలో మమతకు ప్రమేయం ఉందని ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఇటీవల స్పందించిన మమతా, తన జోక్యం ఉందని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. కునాల్ ఘోష్ ఆరోపణలపై ఆమె ఏ విధంగా స్పందిస్తారో వేసిచూడాల్సిందే.