శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (13:50 IST)

అల్కా లాంబాకు కన్ను కొట్టాడు.. చెంప దెబ్బ రుచి చూశాడు..!

అల్కా లాంబా.. ఈమెవరో తెలిసిందే.. కదా.. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చాందినీ చౌక్ నుంచి ఎన్నికైన ఎంఎల్ఎ. ఢిల్లీ టూరిజం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా కూడా అల్కా లాంబా విధులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కవి మిరాజ్ గాలిబ్ నివసించిన భవనాన్ని పరిశీలించేందుకు శుక్రవారం వచ్చారు. ఆ సమయంలో రాజేష్ అనే 20 ఏళ్ల యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
కన్ను కొట్టాడు. దగ్గరగా వచ్చి తాకేందుకు యత్నించాడు. దీన్ని గ్రహించిన అల్కా వాడి చంపపై ఒక్క పీకు పీకారు. దీంతో రాజేష్ పరుగు లంఘించుకోగా, అక్కడే ఉన్న ఆప్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాజేష్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని బంధువులు చెబుతుండగా, అందుకు తగ్గ మెడికల్ ఆధారాలు చూపలేదని అల్కా ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.