Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం నాదే, నేను మొఘల్ వారసుడిని?: యాకుబ్

బుధవారం, 1 నవంబరు 2017 (08:50 IST)

Widgets Magazine
Rama-sitha-lakshmana
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం తనదేనని యాకుబ్ హబీబుద్ధీన్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అయితే బాబ్రీ మసీదును 1992లో కూల్చి వేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్న మీడియా ప్రశ్నకు మాత్రం యాకుబ్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు.
 
ఇంకా యాకూబ్ మీడియాతో మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు బాబర్‌ది అని, మొఘల్ వంశస్థులకు తాను వారసుడిని కావడంతో ఆ స్థలం తనకే దక్కుతుందని కొత్త వాదనను వినిపించాడు. అంతేగాకుండా మొఘల్ సామ్రాజ్యాధినేత బహదూర్ షా జాఫర్‌కు తానే అసలైన వారసుడని, అందుకు ఇదే సాక్ష్యమంటూ డీఎన్ఏ రిపోర్ట్‌తో సహా మీడియాకు చూపించాడు.
 
ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తనను ముతవల్లీగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు. తనను ముతవల్లీగా ప్రకటించకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించాడు. అయోధ్యలోని రామ జన్మభూమి స్థలాన్ని తనకు అప్పగించినట్లైతే ప్రస్తుతం నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తానని చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. అయోధ్యలో దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అయోధ్యను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేయడానికే  ‘త్రేతా యుగం నాటి దీపావళి’ని ప్రజల కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. అయోధ్య నగర్‌ నిగమ్‌లో ఉన్న జనాభా 1.71 లక్షలని దానికి సమాన సంఖ్యలోనే దీపావళికి దీపాలు వెలిగించినట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయలేదా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక ...

news

యూపీఎస్సీ ఎగ్జామ్.. చూచిరాత కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులో ...

news

స్టేషన్‌లో ఖాకీలో మందుతాగి.. అమ్మాయిలతో డ్యాన్స్ వేశారు...

హోలీ సిటీగా పేరుగాంచిన పంజాబ్ రాష్ట్రంలో పోలీసులే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ...

news

తమిళనాడు : మరో 24 గంటలు అతి భారీ వర్షాలు

ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ...

Widgets Magazine