Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వివాహేతర సంబంధం.. తండ్రి హత్య.. తల్లి జైలుకు.. రోడ్డున పడిన ఏడాది కుమారుడు..

గురువారం, 1 డిశెంబరు 2016 (15:02 IST)

Widgets Magazine
murder

వివాహేతర సంబంధం వద్దని వారించడంతో ఫైర్ అయిన ఓ మహిళ ప్రియుడితో చేతులు కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల్లోకి వెళితే.. చెన్నై వడపళని భక్తవత్సలం కాలనీకి చెందిన గోపాలకృష్ణన్ (35) ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య భారతి. ఈ దంపతులకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. 
 
బుధవారం గుర్తుతెలియని వ్యక్తి వారి ఇంటి తలుపులు తట్టాడు. గోపాలకృష్ణన్ తలుపులు తెరచి చూడగా ఎదురుగా ఓ వ్యక్తి కత్తి పట్టుకుని కనిపించాడు. తేరుకునేలోపే ఆ వ్యక్తి గోపాలకృష్ణన్‌పై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
భర్త కేకలు విన్న భార్య అక్కడికి రావడం గుర్తించిన ఆ వ్యక్తి ఆమెపై మత్తుమందు స్ప్రే చల్లి నగలు, నగదు దోచుకుని పరారయ్యాడు. ఇదిలా ఉండగా, అదే సమయంలో గస్తీ పనులు చేపడుతున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో హత్య చేసిన వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం తెలుసుకున్న గోపాలకృష్ణన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. 
 
పక్కా ప్లాన్ ప్రకారమే హత్యచేసి నగదు, నగలు దోచుకుని విదేశాలకు పరారయ్యేందుకు యత్నించి పట్టుబడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్టుచేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. వివాహేతర సంబంధం కారణంగా తండ్రి హత్యకు గురవగా, తల్లి జైలు పాలవడంతో ఏడాది కుమారుడు రోడ్డున పడ్డాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిత్తూరు జిల్లాలో కరెన్సీ మాఫీయా.. భారీ కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి

ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత ...

news

ముకేష్ అంబానీ బంపర్ ఆఫర్... జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్... 31-03-17 వరకూ ఫ్రీ

ముకేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఉచిత సర్వీసులను ...

news

శ్రీకాళహస్తిలో హైటెక్ వ్యభిచారం.. వాట్సాప్‌లో ఫోటోలు.. రేటు...

చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ...

news

నెటిజన్ల దృష్టి ఆకట్టుకున్న దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్..

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాంకులు, ...

Widgets Magazine