శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (08:54 IST)

జయలలిత మరణం వెనుక మన్నార్‌గుడి మాఫియా హస్తం : అన్నాడీఎంకే ఎంపీలకు మోడీ చేరవేత?

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం వెనుక మన్నార్‌గుడి మాఫియా హస్తముందా? అవుననే అంటున్నారు తమిళనాడు రాష్ట్ర ప్రజలు. ఇపుడు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అన్నాడీఎంకే ఎంపీలను

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం వెనుక మన్నార్‌గుడి మాఫియా హస్తముందా? అవుననే అంటున్నారు తమిళనాడు రాష్ట్ర ప్రజలు. ఇపుడు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అన్నాడీఎంకే ఎంపీలను హెచ్చరించినట్టు సమాచారం. అయితే జయలలిత మరణం తర్వాత వారు అవేమి పట్టించుకోకుండా తమ స్వలాభాలా కోసం చిన్నమ్మ శశికళకు జైకొడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. 
 
గత యేడాది సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, అమ్మ ఆరోగ్యం క్షీణించడం వెనుక మన్నార్‌గుడి మాఫియా హస్తమున్నదని ఆది నుంచి ముమ్మరంగా ప్రచారం జరిగింది. దీనికితోడు జయను రెండున్నర నెలలపాటు ఎవరికీ కనిపించకుండా ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచడంపైనా ఇప్పటికే పలురకాల సందేహాలు రేగుతున్నాయి. 
 
‘అమ్మ’ మృతి వెనుక ఎలాంటి కుట్రలు, రహస్యాలు లేవని వైద్యులు చెబుతున్నా.. వీటన్నింటి వెనుకా శశికళ హస్తముందని ఇప్పటికీ అన్నాడీఎంకేలోని అధిక శాతం మంది కార్యకర్తలు బలీయంగా నమ్ముతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె పట్ల మరికొంత అసంతృప్తి పెరిగింది. తాను ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు.. జయ నమ్మినబంటు పన్నీర్‌సెల్వంను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలగించారని ప్రజలు.. మరీ ముఖ్యంగా అన్నాడీఎంకే కార్యకర్తలు దృఢంగా విశ్వసిస్తున్నారు.
 
ఇదికూడా శశికళ పట్ల కార్యకర్తల్లో ఆగ్రహాన్ని మరింతగా పెంచుతోంది. దీనికితోడు కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు.. అమ్మ ఆరోగ్యం క్షీణించడం వెనుక మన్నార్‌గుడి మాఫియా హస్తముందని తనను కలిసిన అన్నాడీఎంకే ఎంపీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హెచ్చరించినట్టు సమాచారం. అయినప్పటికీ.. ఆ పార్టీ ఎంపీలు ఇవేమీ పట్టించుకోకుండా తమ స్వలాభాల కోసం చిన్నమ్మకు జైకొడుతున్నారు. దీనికితోడు ఇపుడు పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించినట్టు తెలుసుకున్న మోడీ.. మరింత ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మొత్తంమీద మన్నార్‌గుడి మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ తెరవెనుక రాజకీయాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.