శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (18:20 IST)

దేశంలో ఏకైక మరకత లింగం చోరీకి గురైంది.. ఆ లింగాన్ని పూజిస్తే శుభాలే

దేశంలోని ఒకే ఒక మరకత లింగం చోరీకి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణానికి సమీపంలో తిరుక్కవలై త్యాగరాజస్వామి ఆలయంలోని మరకత శివలింగం చోరీకి గురైంది. శతాబ్దాల నాడు రాజేంద్ర చోళరాజు తూర్పు దేశాల నుంచ

దేశంలోని ఒకే ఒక మరకత లింగం చోరీకి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణానికి సమీపంలో తిరుక్కవలై త్యాగరాజస్వామి ఆలయంలోని మరకత శివలింగం చోరీకి గురైంది. శతాబ్దాల నాడు రాజేంద్ర చోళరాజు తూర్పు దేశాల నుంచి ఈ లింగాన్ని తెప్పించి ప్రతిష్టించగా ప్రస్తుతం మరకత శివలింగం చోరీకి గురికావడం సంచలనమైంది. 
 
ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని భావిస్తున్న సమయంలోనే ఈ దొంగతనం కాస్త జరిగిపోయిందని అధికారులు చెప్పారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గర్భగుడి తలుపులు తీసిన వేళ, సేఫ్టీ అలారం పనిచేయలేదని.. గుడి గురించి తెలిసిన వారే ఆ లింగాన్ని దోచుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరకత లింగం చోరీ కావడం పట్ల ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. ఆలయ సూపరింటెండెంట్ ఎం.శవురిరాజన్ ప్రకారం.. ఆదివారం ఉదయం లింగానికి పూజాకార్యక్రమాలు పూర్తిచేసిన అనంతరం పూజారి మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఆయన ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతుండగా శివలింగం లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇకపోతే.. ఈ లింగం వెలలేనిది.. అమూల్యమైనది.  
 
ఈ లింగానికి పంచామృతాలతో అభిషేకించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసమని శవురిరాజన్ తెలిపారు. ఈ మరకత లింగానికి పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అలాంటి మహిమాన్వితమైన లింగం కనిపించకపోవడం అశుభ సూచకమా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.