శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (15:58 IST)

అర్థరాత్రి చాటింగ్.. మందలించిన తల్లిదండ్రులు.. బాలుడు ఆత్మహత్య..!

ఇటీవల ట్విట్టర్, వాట్స్ యాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది కొందరు పిల్లల్లో పిచ్చిగా కూడా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చాటింగ్‌లతో కాలం గడిపేస్తూ విద్యార్థులు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. 
 
ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో ఫేస్‌బుక్ చాటింగ్ ఏంటని తండ్రి మందలించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అలహాబాద్ లోని పరాస్ నగర్‌కు చెందిన 14 ఏళ్ల విద్యార్థి బుధవారం అర్ధరాత్రి ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తుండగా తండ్రి తీవ్రంగా మందలించి, ఫోన్ విసిరేశాడు.
 
దీంతో మనస్థాపం చెందిన బాలుడు.. అందరూ పడుకున్న తర్వాత తండ్రికి చెందిన 32 బోర్ రివాల్వర్‌తో కణతకు గురిపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. రక్తపు మడుగులో పడిఉన్న అతణ్ని తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.