ప్రేమ పేరిట మోసం చేశాడు.. అబార్షన్ చేయించి మొహం చాటేశాడు..

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (18:17 IST)
పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. ఆపై అబార్షన్ చేయించాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలోని నూతలపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం పోతుకట్లలో జరిగిన తిరునాళ్లకు వెళ్లింది. 
 
అక్కడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఆమెను కలిశాడు. బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికపై ఆ యువకుడు లొంగదీసుకున్నాడు. శారీరకంగా కలిశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీయడంతో ఇప్పటికి అబార్షన్ చేసుకోమని.. మందులు ఇప్పించి గర్భం పోయేలా చేశాడు. ఆపై పెళ్లి చేసుకునేది లేదని మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికపై 16వ ఏట నుంచే లైంగిక దాడి జరిగిందని.. ప్రస్తుతం ఆ బాలిక 18 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీనిపై మరింత చదవండి :