Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నమ్మ జైలుకు.. ఎమ్మెల్యేలు ఇంటికి.. ఐదుగురు గోడదూకి జంప్.. ఎక్కడికెళ్లారు?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (11:00 IST)

Widgets Magazine
golden bay resorts

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, తమ వాహనాల్లో గోల్డెన్ బే రిసార్టును వీడి వెళ్లారు. దీంతో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు పైగానే రాత్రి రిసార్ట్‌ను వదిలి ఇళ్లకు చేరుకున్నారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఇంకా రిసార్ట్‌లోనే ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్‌ ఇవాళ ఉదయం జంప్ అయినట్లు తెలుస్తోంది. 
 
శశికళ వర్గంలోని ఈ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గోడ దూకి పారియారు. పన్నీర్ వర్గంలో చేరేందుకే వారు ఈ చర్యకు పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ ఐదుగురు ఎవరనేదానికి ఇంకా క్లారిటీ రాలేదు. గోడదూకి పారిపోయిన వారు పన్నీర్ సెల్వంకు మద్దతిస్తారో లేదో వేచి చూడాలి. 
 
ఇక చిన్నమ్మ జైలుకు వెళ్తున్నా.. అన్నాడీఎంకే పార్టీని తన హస్తంలోనే ఉండాలని ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే పన్నీర్‌కు చెక్ పెట్టేందుకు పళని సామిని రంగంలోకి దించింది. అప్పుడే జైలులో ఉంటూ పాలన చేసేందుకు సులువవుతుందని శశికళ భావిస్తోంది. 
 
శశికళ వ్యవహారం చూస్తున్న తమిళ ప్రజలు చాలా ముదురని విమర్శిస్తున్నారు. అమ్మ వెంట వుండీ ఇలాంటి ఎత్తుగడలతోనే శశికళ జయను కీలుబొమ్మను చేసివుంటుందని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ శశికళకు చెక్ పెట్టి అన్నాడీఎంకేలో గూండాలను ఇంటికి పంపించాలనుకున్న పన్నీరు బలపరీక్షలో నెగ్గుతారా? ఎమ్మెల్యేలు పళనికి సపోర్ట్ చేసి.. చిన్నమ్మను నెత్తిన పెట్టుకుంటారా? లేకుంటే వీరవిధేయుడైన పన్నీరుకు హ్యాండిస్తారా అనేది తెలియాల్సి వుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత, యడ్యూరప్ప బ్యారక్‌లోనే చిన్నమ్మ.. కోర్టులో లొంగిపోనున్న శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

news

రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 25మందికి అస్వస్థత.. ఇంటికి పంపించమని విజ్ఞప్తి.. శశికళ నో..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును సినీ నటుడు సుమన్ ...

news

పీఎస్ఎల్వీ-సీ37తో ఇస్రో కొత్త రికార్డు.. ఏకకాలంలో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి.. సక్సెస్

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ...

news

సమంత తప్ప రాష్ట్రంలో ఇంకెవవ్వరూ కనిపించలేదా? చెప్పులతో కొట్టే రోజులు?

చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ...

Widgets Magazine