శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (08:56 IST)

2జీ స్పెక్ట్రమ్ కేసులో దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించలేం!

2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్‌‍ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 
 
మరోవైపు మనీ లాండరింగ్ కేసులో దయాళు అమ్మాళ్, డీఎంకే ఎంపీ కనిమొళికి తాత్కాలిక ఉపశమనం లభించింది. స్పెక్ట్రం కుంభకోణం కేసులో దయాళు అమ్మాళ్, కనిమొళితో పాటు కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతరులకు ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరితో ఐదు లక్షల వ్యక్తిగత పూచికత్తు బాండు, అంతే మొత్తాలకు మరో ఇద్దరితో వ్యక్తిగత పూచీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.