శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:52 IST)

ముంబైలో కోతి హంగామా.. చేతులు వెనక్కి విరిచి కట్టేసి.. బోనులో బంధించి..?

ఎవరైనా ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తారు? దొంగను పట్టుకుని పోలీసులకి అప్పగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగను పారిపోవనివ్వకుండా, ఎదురు తిరగడానికి గానీ వీల్లేకుండా చేస్తారు. కానీ మన దేశంలో.. అందులోనూ ముంబై మహానగరంలో ఒక దొంగను అధికారులు ఇలాగే బంధించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ దొంగ ఎవరో కాదు.. శ్రీ శ్రీ కోతిగారు!
 
అవును.. ముంబైలోని ఓ కాలనీలోకి ప్రవేశించి నానా గొడవ చేయడమే కాకుండా తిండి పదార్థాలను దొంగిలిస్తూ, వస్తువులు విసిరేస్తూ ప్రజలను ఓ కోతి నానాతిప్పలు పెడుతోందట. దాంతో విసిగిపోయిన ఆ కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సదరు కోతిగారిని పట్టుకుని, ఇలా చేతులు వెనక్కి విరిచి కట్టేయడమే కాకుండా, కాళ్లు కూడా కట్టేసి ఎటూ కదలకుండా అలా ఉంచేశారట. దానికి ఆకలి వేసే సమయానికి మాత్రం తిండి పెడుతున్నారట. కోతిగారి అల్లరి భరించలేక చివరకు ఓ బోనులో బంధించారట. అదండీ జరిగింది..!