శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:28 IST)

లవ్ మ్యారేజెస్ 31%, పెద్దలు కుదిర్చినవి 69%... దిస్ ఈజ్ ఇండియా...

ప్రేమించుకున్నా పెళ్లి మాత్రం పెద్దల ఇష్టమే... ఒకవేళ ప్రేమించుకున్నా పెళ్లి నిర్ణయము తల్లిదండ్రులదే. ఇదీ ఇండియన్ అబ్బాయిలు, అమ్మాయిల మైండ్ సెట్. ప్రపంచీకరణ శరవేగంతో దూసుకుపోతూ పాశ్చాత్య పోకడలు, స్వేచ్చా జీవితపు రుచులు భారతదేశంలోకి చొరబడ్డప్పటికీ భారతదేశ అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రం తాము ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకే అగ్రతాంబూలం ఇస్తామంటున్నారు. తాజాగా ఇదే విషయం స్పష్టమైంది. భారతీయులు ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళకే మొగ్గు చూపుతున్నారని ఓ సర్వేలో తేటతెల్లమైంది.
 
మహా నగరాలు, నగరాల్లో నివశించే సుమారు ఆరు వందల జంటలను ప్రేమ లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్నారా అని అడిగినప్పుడు వారిలో 69 శాతం అరేంజ్డ్ మ్యారేజీ అని చెప్పగా, 31 శాతం మంది ప్రేమ వివాహాలతో ఒకటైనట్లు చెప్పారు. ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలకే యువత మొగ్గు చూపుతున్నట్లు తేలింది.