శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (18:45 IST)

మదర్ థెరెసా 18 ఏళ్ల నాటి ఫోటో నెట్‌లో హల్ చల్!

మదర్ థెరెసా వృద్ధాప్య దశలో ఉన్న ఫోటోలే చాలామంది చూసివుంటాం.. అయితే సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మదర్ థెరెసా... ఆమె 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు. థెరెసా యవ్వనంలో ఉన్నప్పటి ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె 18 ఏళ్ల ఉన్నప్పటి ఫోటో అదని అందులో చెబుతున్నారు. పైన వర్ణిస్తూ చెప్పిన సారూప్యాలన్నీ ఆ ఫోటో గురించే. ఎంతో స్పష్టంగా, సాధారణంగా కనిపిస్తున్న ఆ ఫోటోల ఉన్న థెరెసాయేనా నన్‌గా మారి, ఎంతోమందికి సేవ చేసిందని ముక్కున వేలేసుకోక మానరు. 
 
నిరాశ్రయులైన, క్షయవ్యాధితో బాధపడుతున్న, కుష్టు రోగుల సంక్షేమం, పునరావాసం కోసం భారత్‌లో 1950లో రోమన్ క్యాథలిక్ సంస్థను థెరెసా స్థాపించారు. తరువాత కాలంలో 133 దేశాల్లో పలువురు నన్‌లతో ఈ సంస్థ తరపున మిషనరీలను నెలకొల్పి సేవ చేశారు. ఆమె అనితరమైన సేవలను గుర్తించిన 1997 నాటి భారత ప్రభుత్వం నోబెల్ శాంతి పురస్కారం ప్రదానం చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 5న మదర్ తుదిశ్వాస విడిచారు.
 
అరేబియన్ రోమన్ క్యాథలిక్ అయిన మదర్ థెరిసా భారత పౌరసత్వంతో కోల్ కతాలో మిషనరీని నడిపారు. 1980లో మదర్ థెరిసాకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు లభించింది.