స్టోర్‌ రూంకు తీసుకెళ్లి "సెక్సీగా, హాట్‌గా ఉన్నావు... కోరిక తీర్చమన్న" సీనియర్...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:27 IST)

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ యువతి సీనియర్ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 19 యేళ్ళ వయసున్న యువతిని 53 యేళ్ల వయసుండే సీనియర్ ఉద్యోగి ఒకరు స్టోరూమ్‌కు తీసుకెళ్లి... నీవు చాలా సెక్సీగా, హాట్‌గా ఉన్నావు.. కోర్కె తీర్చమన్నాడు. దీంతో షాక్‌కు గురైన ఆ యువతి ఈ వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి అంధేరీలోని ఎస్‌ఈఈపీజడ్ అనే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తోంది. ఇదే కంపెనీలో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 53 ఏళ్ల ఉద్యోగి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆ యువతిని స్టో రూమ్‌కి పిలిచాడు. "నీవు సెక్సీగా, హాట్ గా ఉన్నావు... నా కోరిక తీర్చు" అంటూ యువతిని లైంగికంగా వేధించాడు. 
 
పైగా, తన కోరిక తీరిస్తే కంపెనీలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని యువతికి ఆశపెట్టాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కంపెనీ యజమాని కూడా మహిళా ఉద్యోగులను వేధించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిశువును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కొరియర్ చేసింది: పార్శిల్ కదిలింది.. ఏడుపు శబ్ధం వినిపించడంతో?

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ...

news

ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిలను కాదు... అబ్బాయిలను : బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్

హర్యానా రాష్ట్రంలో ఓ ఐఏఎస్ కుమార్తెను హర్యానా రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు ...

news

పెళ్ళికంటూ బయల్దేరి జైలు డాబాపై దిగిన హెలికాఫ్టర్.. పరుగులు తీసిన సిబ్బంది..

పెళ్ళి వేడుక కోసం హెలికాప్టర్‌లో బయల్దేరిన ఓ కుటుంబం.. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లకుండా ...

news

అత్త నాకిచ్చింది.. నన్నెవరూ పీకలేరు... టీటీవీ దినకరన్

తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కథ గుర్తుకు వస్తుంది. టామ్ అండ్ జెర్రీలకు ...