Widgets Magazine

ఇదేం గోల.. ట్యూటర్‌కి గత జన్మ గుర్తుకొచ్చిందా..? యువతిని భర్త అంటుందే?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:30 IST)

గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ విద్యార్థినిని ఓ మహిళా ట్యూటర్ వేధించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే  వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమెకు ఇండోర్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థినిని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఆ అమ్మాయితో మాట కలిపింది. 
marriage
 
అలా వారి మధ్య పరిచయం ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. తన తల్లి క్యాన్సర్ రోగి కావడంతో సదరు యువతి ముంబైలోనే కొద్దిరోజులు ఉంది. దీంతో వెరోనికా ఆమెకు ప్రతిరోజూ ఫోన్ చేయడం మొదలు పెట్టింది. యువతి తల్లి గురించి ఆరా తీస్తూ.. ఆమెతో స్నేహం పెంచుకుంది.
 
అయితే కొద్దిరోజుల నుంచి గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ.. ఈ జన్మలో కూడా నా భర్తగా నువ్వే వుండాలని.. మనం పెళ్లి చేసుకుని బంధాన్ని కొనసాగిద్దాం అంటూ అంటూ వేధించసాగింది. వెరోనికా వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్ ఎత్తడం మానేసింది.. దీంతో ఉన్మాదిగా మారిపోయిన వెరోనికా.. ఇండోర్ వెళ్లి యువతి చదువుకునే కళాశాలకు వెళ్లి ఆరా తీసింది. విద్యార్థినిని కిడ్నాప్ చేయాలనుకుంది. 
 
ఇందుకోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతి ఫ్లాట్‌కు వెళ్లిన వెరోనికా ఆమెను అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ పరిణామానికి నివ్వెరపోయిన విద్యార్థిని వెంటే సేఫ్టీ అలారమ్ మోగించడంతో అపార్ట్‌మెంట్లో ఉంటున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెరోనికాను, ఆమెకు సాయం చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెరోనికా చెప్పిన కారణం విని పోలీసుల విస్తుపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్షా.. అవి అందరినీ కుట్టేస్తున్నాయ్...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సభకు ...

news

చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...

పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి ...

news

చెన్నై సెంట్రల్ స్టేషన్ పేరును.. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషనుగా..

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తమిళనాడు కేబినెట్ కేంద్రాన్ని ...

news

పెళ్లైయ్యాక ఎందుకొచ్చావ్.. ముఖం చాటేసిన ప్రియుడు.. కారులో వెళ్తూ..?

ఒకవైపు ప్రియుడికి దూరమైన ఆవేదన వేధించింది. మరోవైపు తల్లిదండ్రులు వేరొక వ్యక్తితో వివాహం ...

Widgets Magazine