Widgets Magazine

కూరలో కారం ఎక్కువైందని భార్యను చంపిన భర్త.. అక్రమ అఫైర్‌కు తల్లి అడ్డు.. చంపి ఐదు రోజులు?

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (15:15 IST)

Widgets Magazine

దేశంలో మహిళలపై  అఘాయిత్యాలు, నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. కూరలో కారం ఎక్కువైందనే కోపంతో భర్త భార్యను కర్రతో బాది చంపేసిన ఘటన ఢిల్లీలోని మధువిహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్లంబర్‌గా పనిచేస్తున్న సుబోధ్ అనే వ్యక్తి.. భార్య (మనీషా)కు తెలియకుండానే మునియా రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో విబేధాలు తలెత్తాయి. ఫలితంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. 
 
అయితే ఈ నెల 10వ తేదీన భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చి కాపురం మొదలెట్టాడు. కానీ మునియా కూడా భర్త ఇంటికి పక్కనే ఉండేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భర్తకోసం మనీషా వండిన కూరలో కారం ఎక్కువుందని.. సుబోధ్ భార్యను చంపేశాడు. కర్రతో బాది ఈ దారుణానికి ఒడిగట్టాడు. మనీషాను హత్య చేయాలని పక్కా ప్లాన్‌తో సుబోధ్ ఇదంతా చేశాడని పోలీసులు చెప్తున్నారు. చనిపోయిన మహిళ శరీరంపై 22చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
 
ఇదిలా ఉంటే., మహాబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఇప్పటూర్‌లో దారుణం చోటుచేసుకొంది. వివాహేతర సంబంధానికి తన తల్లి అడ్డుగా ఉందని భావించి కన్నతల్లినే ఆ కుమార్తె హత్య చేసింది. వివాహేతర సంబంధం వద్దని తల్లి కూతురును హెచ్చరిస్తోంది. అయితే తల్లి హెచ్చరికలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఇక తల్లి ఉంటే తన వివాహేతర సంబంధం కొనసాగదని భావించిన ఆమె వెంటనే తల్లిని హత్య చేసింది. 
 
ఐదు రోజుల పాటు తల్లి మృతదేహన్ని ఇంట్లోనే ఉంచింది. ఈ మృతదేహన్ని బయటకు తీసుకెళ్ళే వీలు లేకపోవడంతో ఆమె ఇంట్లోనే శవాన్ని దాచింది. అయితే ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఇంట్లో శవాన్ని గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'అమ్మాడీఎంకే' పేరుతో కొత్త పార్టీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా దీప.. ధర్మయుద్ధానికి "తయార్''

అన్నాడీఎంకే నుంచి వెలివేసిన తర్వాత పురట్చి తలైవర్ (తిరగుబాటు నాయకుడు) పన్నీర్ సెల్వం ...

news

1985.. ఎయిరిండియా కనిష్క కూల్చివేత.. 329 మంది మృతి.. నిందితుడు విడుదల

1985 జూన్ 23 న 329 మందితో కెనడా-మాంట్రియల్-ఢిల్లీ రూట్ లో వెళ్తున్న ఎయిరిండియా విమానం ...

news

ఫూటుగా తాగిన ఫ్రెండ్స్.. డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడని స్నేహితుడినే చంపేశాడు..

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు ...

news

జైల్లో పడ్డా గెలిచిన చిన్నమ్మ... 15 రోజుల్లో పళని ప్రభుత్వం పడిపోతుందా?

జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ...